పొత్తులకు ససేమిరా అంటున్న తమ్ముళ్లు... మరి అధిష్టానం ఏం ఆలోచిస్తోందో..

ఏపీలో టీడీపీ పార్టీకి అనేక ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.ఈ పార్టీని అన్న పెద్ద ఎన్టీఆర్ స్థాపించారు.

ఇక అప్పటి నుంచి అనేక ఒడి దుడుకులను తట్టుకుని పార్టీ నిలబడింది.మార్చి 29 వస్తే ఈ పార్టీని స్థాపించి నాలుగు దశాబ్దాల కాలం అవుతుంది.

అటువంటి టీడీపీ పార్టీ మీద కొన్ని అనామక పార్టీలు పొత్తుల పార్టీ అంటూ నిందలు వేస్తున్నాయని కొంత మంది తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

అసలు టీడీపీ అంటే ఎంతో ఆత్మగౌరవం ఉన్న పార్టీ అని గుర్తు చేస్తున్నారు.

ఈ సారి పొత్తుల ప్రసక్తే వద్దని వారు అధిష్టానాన్ని కోరుతున్నారు.ఇలా పొత్తులు పెట్టుకోవడం అవసరం లేదని చెబుతున్నారు.

పొత్తుల కోసం చిన్న పార్టీలతో కలవడం అస్సలు బాగోలేదని చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.

టీడీపీ పార్టీ చాలా సంవత్సరాలు పాలించింది.ఉమ్మడి ఏపీతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ ను కూడా టీడీపీ పాలించింది.

అటు వంటి టీడీపీని పొత్తుల పార్టీ అని కొంత మంది పార్టీల నేతలు అంటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా మందితో పొత్తుల పార్టీ అని అనిపించుకునే బదులు ఎటువంటి పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని అధిష్టానానికి సూచనలు చేస్తున్నారు.

మరి అధిష్టానం వీరు చేస్తున్న సూచనలను పట్టించుకుంటుందో? లేదో? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మీద జనాలకు తీవ్రంగా వ్యతిరేఖత ఉందని, ఆ వ్యతిరేఖత దృష్య్టా టీడీపీ ఎటువంటి పొత్తులు పెట్టుకోకుండా బరిలోకి దిగాలని వారు కోరుకుంటున్నారు.

అన్న పెద్ద ఎన్టీఆర్ హయాంలో కూడా ఎటువంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన సందర్భాలు ఉన్నాయని తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు.

ఈ సారి ఎన్నికల్లో కూడా పొత్తులు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

అల్లు అర్జున్ గడ్డం కోసమే అన్ని లక్షల ఖర్చా.. పెట్టుడు గడ్డం ఖరీదెంతంటే?