టీడీపీలో ఈ ఫైర్‌బ్రాండ్లు క‌నిపించట్లేదే..!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎంతో మంది నాయకులు పదేపదే మీడియా ముందుకు వచ్చి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న‌న్నా వైసిపితో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడేవారు.

టిడిపి నేతలకు సమాధానం చెప్పలేక వైసిపి నేతలు సైతం తీవ్ర నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోయారు.

ఇష్ట‌మొచ్చిన‌ట్టు నోళ్లు వేసుకుని వైసీపీ వాళ్ల‌ను క‌రిచేసేవారు.నాడు టిడిపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధికార ప్రతినిధులు చాలామంది నిత్యం మీడియాలో హైలెట్ అయ్యేందుకు నానా తాపత్రయ పడే వారు.

టిడిపిలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొందరు ప్రతిరోజు మీడియాలో వైసీపీని జగన్‌ను పెట్టటమే లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు చేసేవారు.

అలాంటి నేతలను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.ఈ ఫైర్‌బ్రాండ్ల‌కు ఎలాంటి పదవులు ఇవ్వలేదు.

ఇటీవల పదవుల పందేరం లోనూ ఈ కీలక నేతలను పట్టించుకోలేదు.మాజీ చింతమనేని ప్రభాకర్ - అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఈ నేతలకు చంద్రబాబు కీలక పదవులు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వీరితోపాటు.ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బీటెక్ ర‌వి, మ‌హిళా నేత‌ల్లో పంచుమ‌ర్తి అనురాధ‌, గిడ్డి ఈశ్వరి వంటివారు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందారు.

ఈ ఫైర్ బ్రాండ్లు అందరికీ ఇటీవల ఏర్పాటు చేసిన‌ పార్లమెంటరీ పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మ‌హిళా క‌మిటీలు, ఇతర పదవుల్లో చోటు ఇవ్వకపోవడంతో చంద్రబాబు వీరిని కావాలనే పక్కన పెట్టారా లేదా ? రాష్ట్ర స్థాయిలో అంతకుమించిన పదవులు కట్టబెడతారా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.

అదే స‌మ‌యంలో వీరిలో ఒక‌రిద్ద‌రు త‌ప్పా చాలా మంది ఫైర్‌బ్రాండ్లు మీడియాలోనే కాదు ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు.

ఇది కూడా రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!