టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చుట్టు బిగుసుకుంటున్న మార్ఫింగ్ వీడియో కేసు.. ?

ఏపీ రాజకీయాలు ఎప్పుడు వేడి వేడిగానే సాగుతుంటాయి.అందులో ఎన్నికలు ఉన్న సమయంలో అయితే ఎన్నో వివాదాలు చోటు చేసుకోవడం, ఒకరి పై ఒకరు దాడులు చేసుకోవడం సాధారణ విషయంగా చూస్తారు.

ఈ క్రమంలోనే ఏపీ రాజకీయ నేతల మీద ఎన్నో కేసులు నమోదు అయ్యి కోర్టుల చుట్టు తిరగడం జరుగుతుంది.

ఇక అవినీతి ఆరోపణలకైతే కొదువే లేదు.మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఓ చదరంగాన్నే తలపిస్తుంది.

ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, మార్ఫింగ్ వీడియో ప్రదర్శించిన కేసు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో ఉమామహేశ్వరరావుకు ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయగా, కొంత సమయాన్ని కోరిన ఈ నేత, విచారణకు హజరవలేదట.

కాగా ఈ నెల 19న మరోమారు కూడ నోటీసులు అందించగా స్పందించక పోవడంతో, నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన అధికారులకు చుక్కెదురే అయ్యిందట.

దేవినేని ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో చేసేది ఏం లేక అధికారులు వెనుదిరిగారట.

మరి ఇలాగే దేవినేని ఉమామహేశ్వరరావు తప్పించుకుని తిరుగుతుంటే ఈ కేసు మరింత గట్టిగా బిగుసుకునే అవకాశం లేకపోలేదని చర్చ సాగుతుందట.

నాగచైతన్య శోభిత పెళ్లి… శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగారు : నాగార్జున