మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!

ఏపీలో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీని ఓటమి భయం వెంటాడుతోందని తెలుస్తోంది.

ఈ సారి కూడా పరాజయం పాలైతే ఉనికిని సైతం కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్న టీడీపీ పార్టీ దాష్టీకానికి పాల్పడిందని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేశ్( Nara Lokesh ) బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే రానున్న ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం మాత్రం టీడీపీ శ్రేణుల్లో లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.తాజాగా టీడీపీ వర్గీయులు చేసిన దాష్టీకానికి వైసీపీ( YCP )కి చెందిన ఓ నేత ప్రాణాలతో పోరాడుతున్నాడని సమాచారం.

"""/" / తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డారని తెలుస్తోంది.

వైసీపీ కార్యకర్తలను దుర్బాషలాడటంతో పాటు ద్విచక్ర వాహనాలతో వారిని ఢీకొట్టారు.ఈ దాడిలో మొత్తం ముగ్గురు గాయపడగా.

వారిలో వైసీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి( Meka Venkata Reddy ) పరిస్థితి విషమంగా ఉంది.

మద్యం మత్తులో వచ్చిన టీడీపీ శ్రేణులు లోకేశ్ విజయం సాధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.

ప్రచారం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.అయితే ముందుగా ఓ యువకుడు వచ్చి వైసీపీ ప్రచారాన్ని ఆపేయాలంటూ దురుసుగా ప్రవర్తించాడు.

తరువాత మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చి వైసీపీ నేతలను, కార్యకర్తలను ఢీకొట్టారు.

"""/" / రోడ్డుపై పడిపోయిన వైసీపీ నేతలను దాష్టీక మూక వదిలిపెట్టలేదు.తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న వారిపై కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారని సమాచారం.

వెంకట్ రెడ్డిపై దాడి జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.

అయితే తలకు తీవ్ర గాయం కావడంతో వెంకట్ రెడ్డి కోమాలో ఉన్నారు.పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.

కేవలం ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలు ఇటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

బయట ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి దాడులు చేయిస్తున్నారని అనుమానాలు బయటకు వస్తున్నాయి.

టీడీపీ రాజకీయ దాహానికి ఎందరు అమాయకులను బలి తీసుకుంటుందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరెన్సీ నోట్ల కట్టలను మంటల్లో పడేసిన యూఎస్ వ్యక్తి.. వీడియో వైరల్..