చంద్రబాబు అరెస్టుకి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన దీక్షలు..!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో( Skill Development Scam ) చంద్రబాబుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
శనివారం ఉదయం కర్నూలు నంద్యాలలో నోటీసులు ఇచ్చి చంద్రబాబుని అరెస్టు చేసి కాన్వాయ్ ద్వారా సాయంత్రం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు.( Kinjarapu Atchannaidu ) చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిస్తూ పత్రిక ప్రకటన చేశారు.
"""/" /
"టీడీపీ( TDP ) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టు, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు (10-09-2023) రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాలలో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించటమైనది.
వైసీపీ ప్రభుత్వ( YCP ) సైకో చర్యలకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం" అంటూ అచ్చెన్నాయుడు.
పత్రికా ప్రకటన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.