Atchannaidu : ఆ డీఎస్పీలపై ఎన్నికల సంఘానికి అచ్చెన్న ఫిర్యాదు 

ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన డిఎస్పిల బదిలీల వ్యవహారంపై టిడిపి( TDP ) అనేక ఆరోపణలు చేసింది.

అంతేకాదు ఇప్పుడు ఆ వ్యవహారంపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు( Atchannaidu ) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చే విధంగా డీఎస్పీల బదిలీలు( DSP Transfers ) చేపట్టారని, అనుకూలంగా ఉన్నవారిని కీలకమైన ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇచ్చారని అచ్చెన్న నాయుడు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారంటూ పదిమంది డీఎస్పీల ల పేర్లను ఎన్నికల సంఘం దృష్టికి అచ్చెన్న తీసుకువెళ్లారు.

దీంతో పాటు అభియోగాలు ఎదుర్కుంటున్న డీఎస్పీల పై తగిన ఆధారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.

"""/" / ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన 42 మంది డిఎస్పీల బదిలీలపై వెంటనే విచారణ చేపట్టి, నిజాలు నిగ్గు తేర్చాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి( YCP ) సహకరించాలని బదిలీ అయిన డిఎస్పి లకు డీజీపీ కి స్పష్టంగా చెప్పారని కేంద్ర ఎన్నికల సంఘానికి( Central Election Commission ) ఇచ్చిన ఫిర్యాదు లేఖలో అచ్చెన్న నాయుడు పేర్కొన్నారు.

ముఖ్యంగా డీఎస్పీలు సుధాకర్ రెడ్డి,( DSP Sudhakar Reddy ) రాంబాబు,( DSP Rambabu ) ఉమా మహేశ్వర రెడ్డి, వీర రాఘవరెడ్డి, సి .

మహేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ రెడ్డి, నారాయణస్వామి రెడ్డి, శ్రీనాథ్, గోపాల్ రెడ్డి, హనుమంతరావు లపై ఫిర్యాదు చేయడంతో పాటు, వారిపై ఉన్న అభియోగాలను సైతం ఫిర్యాదుకు జత చేశారు.

"""/" / అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ, ఈ వ్యవహారంపై మాత్రం టిడిపి గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.

కేవలం డిఎస్పీల బదిలీలే కాకుండా, ఇతర శాఖలకు చెందిన కీలక అధికారుల బదిలీల పైన టిడిపి దృష్టి పెట్టింది.

వైసిపికి ప్రజా ఆదరణ తగ్గడంతోనే  ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రెండోసారి అధికారంలోకి రావాలని చూస్తుందని టిడిపి విమర్శలు చేస్తోంది.

ప్రస్తుతం డీఎస్పీల బదిలీలపై అచ్చెన్న ఇచ్చిన ఫిర్యాదు పై కేంద్ర ఎన్నికల సంఘం తప్పకుండా స్పందిస్తుందని, డిఎస్పిల బదిలీ వ్యవహారంపై తప్పకుండా విచారణ ఆడిస్తుంది అనే నమ్మకంతో టీడీపీ ఉంది.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?