ఈనెల 28 నుంచి వరుస కార్యక్రమాలకు టిడిపి ప్రణాళికలు

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి వరుస కార్యక్రమాలను నిర్వహించనుంది.

ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించనుంది.ఈనెల 28న హైదరాబాదులో  టిడిపి పోలీట్ బ్యూరో సమావేశం జరగనుంది.

అదేవిధంగా మేలు జరిగే మహానాడు నిర్వహణ, పలు అంశాలపై పోలీస్ బ్యూరోలో చర్చించనున్నారని తెలుస్తోంది.

టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అదేవిధంగా 29న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టిడిపి ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.

ఏప్రిల్ తొలి వారంలో విశాఖపట్నం, నెల్లూరు, కడప జిల్లాల్లో టిడిపి జోన్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం టిడిపి నేతలు జనంలోకి వెళ్లేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నేత వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉండేలా కార్యక్రమాలను రూపొందించనున్నారని సమాచారం.

అప్పడాలు అమ్ముతున్న బుడ్డోడు.. రూ.500 ఇస్తానంటే వద్దన్నాడు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే!