ఆ నలుగురిపై అనర్హత వేటు వేయండి అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ పిటిషన్..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అవుతున్న నాయకులతోపాటు పార్టీలకు రాజీనామాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
ముఖ్యంగా అధికార పార్టీలో ఇన్చార్జిల మార్పు విషయంలో భిన్న స్వరాలు వినబడుతున్నాయి.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు.
2019 ఎన్నికలతో గమనిస్తే 2024 ఎన్నికల వాతావరణం పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాజాగా అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ నేతలు( TDP Leaders ) పిటిషన్ అందించారు.
టీడీపీ శాసనసభాపక్ష నేత బాల వీరాంజనేయ స్వామి పేరుతో ఈ పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.
2019 ఎన్నికలలో వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలగిరి టీడీపీ తరపున గెలవడం జరిగింది.
ఆ తర్వాత వైసీపీ( YCP )కి మద్దతు తెలిపారు.దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ నేతలు పిటిషన్ అందించడం జరిగింది.
విషయంలోకి వెళ్తే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేలే ఓటర్లు.దీంతో తాజాగా జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాలు సంచలనంగా మారింది.
భారతీయ ముఠాల మధ్య ఆధిపత్య పోరు .. కెనడాలో ఇద్దరి హత్య, కోర్ట్ సంచలన తీర్పు