చినబాబు ని దూరం పెట్టదండయ్య బాబూ !

పుండు మీద కారం జల్లుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చినబాబు లోకేష్ మీద విమర్శలు చేసేవారు పార్టీలో పెరిగిపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చినబాబు చుట్టూ చేరి భజన చేసిన నాయకులు సైతం లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.ఈ సమయంలో పార్టీని అన్ని విధాలుగా అండగా నిలబడి అధికార పార్టీ మీద విమర్శలు చేయాల్సిన నాయకులు మెల్లి మెల్లిగా తప్పించుకునేందుకు చూస్తున్నారు.

పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలంటే పార్టీలో జోష్ పెంచి కార్యకర్తలు, నాయకుల్లో మనోధైర్యం నింపాల్సిన సమర్ధవంతమైన నాయకుడి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ ఈ భాద్యత చంద్రబాబు నాయుడు సమర్దవంతంగా నిర్వహించారు. """/"/అందుకే మరో నాయకుడి అవసరం టీడీపీకి లేకుండా పోయింది.

చంద్రబాబు కి ప్రత్యామ్న్యాయంగా లోకేష్ ను చంద్రబాబు తయారు చేస్తున్నా ఆయన నాయకత్వంపై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు.

దీంతో మరో ప్రత్యామ్న్యాయ నేత కోసం టీడీపీ నాయకులు ఎదురుచూస్తున్నారు.పార్టీలో ఉన్న నాయకుల్లో మెజార్టీ సంఖ్యలో లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకోవడంలేదు.

ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలు చీలిపోయాయి.

"""/"/వైసీపీ నేతలు దీనిని చక్కగా వినియోగించుకుని విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలు మూల కారణం అయ్యాయి.

అయితే ప్రస్తుతం టీడీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి.పార్టీ నుంచి వెళ్తున్న నేతలంతా వెళ్తూ వెళ్తూ లోకేష్ మీద ఆరోపణలు చేస్తున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది సీనియర్ నేతలను సైతం చిన్న చూపు చూడడంతో వాళ్లంతా ఇప్పుడు పార్టీ అధికారంలో లేక పోవడంతో లోకేష్‌పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.

"""/"/లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే టీడీపీ భవిష్యత్తు మరింత దిగజారిపొతుందని ఆందోళన చెందుతున్నారు.

లోకేష్ కు రాజకీయంగా మరింత బలం చేకూర్చేలా స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నా ఆయనలో ఏ మాత్రం మార్పు కనిపించలేదనేది లోకేష్ ను వ్యతిరేకించే టీడీపీ నాయకుల వాదన.

కెనడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్.. వీడియో వైరల్..