ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించాలి - నారా లోకేష్
TeluguStop.com
నారా లోకేష్ కామెంట్స్.గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహం తొలగించి, మరుగుదొడ్ల దగ్గర పడేసి ఘోరంగా అవమానించింది జగన్ సర్కార్.
మహనీయుల పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగించడం వైసిపి ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది.గుంటూరులోని మదర్ థెరీసా కూడలిలో కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలు గారి విగ్రహాన్ని అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు గారి విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించాలి.
గేమ్ ఛేంజర్ మూవీతో ఆమెకు అవార్డ్ పక్కా.. థమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!