ప్రధాని మోదీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు..!!
TeluguStop.com
దేశంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా జరిగింది.
ఈ క్రమంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ( PM Modi ) సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మోదీ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.
"తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కలిశారు.నా మిత్రుడు చంద్రబాబు( Chandrababu ) నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి.
భారతదేశ ప్రగతికి ఏపీ అభివృద్ధికి( AP Development ) సాధ్యమైనంత చేస్తాం" అని ట్విట్టర్ లో ప్రధాని మోదీ ట్వీట్ చేయటం జరిగింది.
"""/" /
దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం( NDA Government ) కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో తెలుగుదేశం పార్టీ( TDP ) కీలక పాత్ర పోషించడం జరిగింది.
దీంతో ఏపీ అభివృద్ధికి సంబంధించి ప్రధాని మోదీ తెలుగుదేశం పార్టీ ఎంపీల భేటీ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.
దేశాన్ని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రా అభివృద్ధికి సహకారం అందిస్తామని స్పష్టం చేయడం జరిగింది.
ప్రధాని మోదీ చేసిన ట్వీట్ కి సీఎం చంద్రబాబు స్పందించారు."మోదీ జీ.
మా ఎంపీలు లోక్ సభలో ఏపీకి సమర్థవంతమైన ప్రాతినిధ్యం వహిస్తారు.కేంద్రంలో మీ నాయకత్వంలో మన పార్టీలు కలసి వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాయి అని రిప్లై ఇవ్వడం జరిగింది.
ఇది విన్నారా? అడల్ట్స్ కోసం డైపర్స్.. ఒక్కొక్కటి రూ.6,000 అట.. ఉపయోగం ఏంటంటే!