ఎంపీ వద్దు... ఎమ్మెల్యే ముద్దు ! మారిన టీడీపీ ఎంపీల 'రాజకీయం'

ఏపీలో ఎన్నికల సందడి మొదలయ్యే కొద్ది.నాయకుల ఆలోచనా ధోరణి కూడా క్రమక్రమంగా మారుతూ వస్తోంది.

ఎంపీలుగా ఉన్న టీడీపీ నాయకులంతా.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోవాలని కలలుకంటున్న.

ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీగా గెలవడం మాటలు కాదని.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా.ఎమ్మెల్యే గా పోటీ చేసి సులువుగా గెలిచేయవచ్చు అని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు ఆలోచన చేస్తున్నారు.

కానీ వారందరికీ ఉన్నట్టు ఉండి అసెంబ్లీ వైపు గాలి మళ్ళినా.వారందరికీ పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ టికెట్లు ఇస్తారా అనేది సందేహంగానే ఉంది.

ఎందుకంటే.ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ.

తమ సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు.అంతే కాదు.

ఇంకా ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు బాబు ఒప్పుకునే అవకాశం కూడా చాలా తక్కువగానే కనిపిస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎమ్మెల్యే గా పోటీ చేయాలని చూస్తున్న కొంతమంది ఎంపీల రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.

శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు .ఈసారి అసెంబ్లీకి రావటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తన చిన్నాన్న అచ్చెన్నాయుడిని పార్లమెంటుకు పంపి .తాను టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అలాగే.విజయనగరం పార్లమెంట్ సభ్యులు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానంటున్నారు.

ఇక అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు.

అవంతి శ్రీనివాస్ 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి భీమిలిలో గెలిచారు.2014లో టీడీపీలో చేరి అనకాపల్లి పార్లమెంట్‌కు పోటీ చేశారు.

టీడీపీ లోక్‌సభ పక్షనేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం కూడా ఈసారి జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.

గతంలో జగ్గంపేట నుంచి రెండుసార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తనకి ఎంపీ సీట్ ఇవ్వని పక్షంలో .

అసెంబ్లీ సీట్ అయినా కోరుతున్నారు.దీనికి తనతో పాటు కోడలు రూప పేరుని కూడా పరిశీలించాలని ఆయన సూచిస్తున్నారు.

కృష్ణా జిల్లాకు వస్తే బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ అసెంబ్లీకి మొగ్గుచూపుతున్నారు.పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ఆసక్తిగా ఉన్నారు.

ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా వెళ్లాను .ఈసారి ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అధిష్టానాన్ని కోరుతున్నారు.

ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తన వారసుడుగా అల్లుడు శ్రీధర్‌రెడ్డికి అసెంబ్లీ సీటును అడుగుతున్నారు.

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం అసెంబ్లీకి పోటీచేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం ఆశిస్తున్నారు.

హిందూపురం ఎంపీ, సీనియర్ నేత నిమ్మల కిష్టప్ప సైతం ఈసారి అసెంబ్లీ టికెట్ ఇవ్వమని అధిష్టానవర్గాన్ని కోరుతున్నారు.

అదేవిధంగా.పార్టీ రాజ్యసభ సభ్యురాలు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తోట సీతారామలక్ష్మి కూడా .ఈసారి భీమవరం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు..!!