పబ్బులో మద్యం తాగి పడిపోయిన టీడీపీ ఎంపీ..? రహస్యంగా..!!

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని గొప్పలు చెప్పుకుని తిరిగే టీడీపీ నేతలు చేసిన ఓ ఘనకార్యంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఆ ఘటనతో రోజులకు తరబడి ఢిల్లీలో పాగా వేసిన టీడీపీ ఎంపీలకు ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తేలిందంటున్నారు.

అంతేకాకుండా సమాజం పట్ల బాధ్యత కూడా ఉండదని అర్థం అయిందని చెబుతున్నారు.మామూలుగా ఎంపీ పదవి ద్వారా సంక్రమించిన గౌరవం, పరపతిని సొంత విలాసాలకు వాడుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం.

అలాంటి ఉదంతం మరోసారి బయటపడింది.టీడీపీకి చెందిన ఓ ఎంపీ ఢిల్లీలో పబ్బుల్లో దర్శనమిచ్చారని తెలుస్తోంది.

అంతేకాదు అక్కడే పూటుగా తాగి పడిపోయారట.మందు ఎక్కువ అయి డాన్సులు చేసి.

అలసి .పడిపోయిన ఆయన్ను సహచరులు పక్కకు తీసుకెళ్లి సపర్యలు చేయడంతో సాధారణ స్థితిలోకి వచ్చారని తెలుస్తోంది.

అయితే ఆ విషయం బయటకు రానివ్వకుండా ఉండేందుకు అదే పార్టీకి చెందిన ఇతర ఎంపీలు అక్కడి పోలీసులను సైతం మ్యానేజ్ చేశారని సమాచారం.

అయితే ప్రజా సమస్యల కోసమే ఢిల్లీకి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుని తిరిగే టీడీపీ ఎంపీలు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అయితే పబ్బులకు వెళ్లి డ్యాన్సులు చేయడమే కాకుండా తప్పతాగి పడిపోయారని తెలియడంతో టీడీపీ నేతలపై ప్రజల్లో ఉన్న కాస్త గౌరవం కూడా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజల మంచి కోసం పర్యటనలు చేస్తున్నారని భావిస్తే.ఢిల్లీకి వెళ్లి ఇలాంటి వేషాలు వేస్తున్నారా అంటూ ఏపీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారట.

గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?