టీడీపీ ఎంపీ : విందు ఇచ్చి మరీ రిటైర్మెంట్ ప్రకటన ?
TeluguStop.com
గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలకనున్నారు.
రెండుసార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
2014 , 19 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా జయదేవ్ టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
రాజకీయ వేత్తగానే కాకుండా, విజయవంతమైన వ్యాపారవేత్తగాను జయదేవ్( Galla Jayadev ) కు మంచి గుర్తింపు ఉంది.
అయితే రాజకీయాల కారణంగా తన వ్యాపార వ్యవహారాలకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదని జయదేవ్ నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు టిడిపి అధిష్టానానికి చాలా కాలం క్రితమే ఈ విషయాన్ని చెప్పారట.
వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయనని, అక్కడ ప్రత్యామ్నాయంగా మరొకరిని ఎంపిక చేసుకోవాలని, తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది .
"""/" /
గల్లా జయదేవ్ కుటుంబ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంది.చిత్తూరు జిల్లా( Chittoor) రాజకీయాల్లో మూడు తరాల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లోనే కొనసాగుతూ వస్తున్నారు.
గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి 1989లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
2004 - 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు .వైస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhara Reddy )ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు.
2014లో టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా ఓటమి చెందారు.కానీ జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు.
రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నుంచి రాజకీయంగా దూకుడు తగ్గించారు. """/" /
పార్టీ కార్యక్రమాలలోనూ పెద్దగా పాల్గొనడం లేదు.
తన రాజకీయ జీవితానికి ఇక విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్న జయదేవ్ ఈనెల 28వ తేదీన ఆత్మీయ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మేరకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కీలక నాయకులకు విందులు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు తనకుసహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా ఆయన ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!