జగన్ కు వెటకారంగా శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ ఎంపీ
TeluguStop.com
అధికార విపక్ష పార్టీలు నిత్యం ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నా పండుగ, పుట్టిన రోజు సందర్భాల్లో మాత్రం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.
ఇదంతా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
అయితే ఇది పెద్ద గొప్ప విషయం కాకపోయినా ఆయన ఆ శుభాక్షాంక్షలు వెటకారంగా చెప్పడమే చర్చకు తెరలేపింది.
"""/"/
‘‘ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన జగన్‌కు, ఆయన గ్యాంగ్‌కు, వైసీపీకి ప్రత్యేకమైన క్రిస్టమస్ శుభాకాంక్షలు.
రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని క్రిస్టమస్ సందర్భంగా భగవంతుడిని కోరుకోండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా కేశినేని నాని శుభాకాంక్షలు వెటకారంగా చెప్పారు.
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?