అమరావతి కూల్చేద్దాం...హైదరాబాద్ ని అభివృద్ధి చేద్దాం అంటున్న జగన్!

టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత కొద్దీ రోజులుగా పేస్ బుక్ ద్వారా స్పందిస్తూ వస్తున్న నాని ఇటీవల ప్రజావేదిక కూల్చివేత ఘటన పై అలానే ఏపీ సి ఎం జగన్ ను ప్రశ్నిస్తూ కొన్ని పోస్టు లు పెట్టిన సంగతి సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ పార్టీ పై నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని కూల్చివేసి, హైదరాబాద్ ని అభివృద్ధి చేసే దిశగా జగన్ చర్యలు ఉన్నాయి అంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

ఇటీవల ఏపీ సి ఎం జగన్,అలానే తెలంగాణా సీఎం కేసీఆర్ లు భేటీ అయి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమయంలో అపరిష్కృతం కానీ సమస్య లపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించేసిన విషయం విదితమే.

అయితే ఇప్పుడు తాజాగా చర్చలు జరిపిన తరువాత కేశినేని నాని పై ట్వీట్ చేశారు.

అమరావతిని కూల్చేద్దాం.హైదరాబాద్ ని అభివృద్ధి చేద్దాం అనేలా జగన్ చర్యలు ఉన్నాయంటూ నాని దుయ్యబట్టారు.

"""/"/ ఈ నిర్ణయాల ఫలితమే ప్రజావేదిక కూల్చివేత, అలానే విజయవాడ-సింగపూర్ విమాన సర్వీస్ రద్దు వంటి నిర్ణయాలు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

ఇటీవల కృష్ణా నది కరకట్ట వద్ద టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అని పేర్కొంటూ కూల్చివేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.మరి నాని ట్వీట్ కు వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

1936లో రూ.2,700కే షెవర్లే కారు.. అప్పటి ధరలు వింటే దిమ్మతిరిగిపోతుంది..!