రాజ్యసభ వేదికగా పవన్ కు అండగా టీడీపీ ?
TeluguStop.com
జనసేన విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక క్లారిటీ ఉంది.ఎప్పటికైనా పవన్ తమతో పొత్తు పెట్టుకుంటారని, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన , టిడిపి కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తాము అనే నమ్మకంతో ఉన్నారు.
దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.ప్రస్తుతం బిజెపి, జనసేన పార్టీలు ఏపీ లో పొత్తు పెట్టుకున్నాయి.
కానీ ఈ పొత్తు పైనా అనేక అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.ఎందుకంటే పేరుకి పొత్తు తప్ప ఈ రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై విషయంలోనూ ఆందోళన చేపట్టలేదు.
విడివిడిగా పోరాటాలు చేస్తున్నారు.పొత్తు పెట్టుకోక ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర బిజెపి పెద్దలు ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు లభించడం లేదు.
కనీసం ప్రధాని అపాయింట్మెంట్ పవన్ కు లభించలేదు.ఈ వ్యవహారంతో ఖచ్చితంగా పవన్ టిడిపి వైపు మొగ్గు చూపుతారని బాబు భావిస్తున్నారు.
ఇదే విషయాన్ని కుప్పం నియోజకవర్గం పర్యటనలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.రాజకీయాల్లో వన్ సైడ్ లవ్ సరికాదని పరోక్షంగా జనసేన పొత్తు కోరుకుంటున్నాము అనే విధంగా బాబు వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో పవన్ కళ్యాణ్ అంశాన్ని టిడిపి ప్రస్తావించింది.వైసీపీ ప్రభుత్వం ఆయనపై వేధింపులకు దిగుతోందనే విధంగా టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు.
ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, క్యాసినోలను కూడా ప్రభుత్వం తెర మీదకు తీసుకు వచ్చింది అంటూ కనకమేడల ప్రసంగించారు.
"""/"/
అలాగే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని, సినిమా టికెట్ల విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని, కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రస్తావించారు.
ప్రముఖ నటుడు, ఒక రాజకీయపార్టీకి అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తోంది అని పవన్ అంశాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల హైలెట్ చేశారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. ఆ విషయంలో సీరియస్ అవుతున్న ఫ్యాన్స్!