ఇసుక డ్యామేజ్ : చంద్రబాబుకు ఎమ్మెల్యేల ఫిర్యాదు ?
TeluguStop.com
గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఇసుక ధరలు భారీగా పెరిగాయని, నిర్మాణరంగం కుదైలైందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లో టిడిపి , జనసేనలు విమర్శలు చేశాయి.
తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక( Free Sand ) అందిస్తామని, భవన నిర్మాణ రంగానికి చేయూతనందిస్తామని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పూర్తిస్థాయిలో కలుగుతుందని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు.కొద్దిరోజుల క్రితమే ఆర్భాటంగా ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రమంతటా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని పండుగలు నిర్వహించారు.అయితే వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఉచిత ఇసుక విధానానికి అనేక ఇబ్బందులు మొదలయ్యాయి.
"""/" /
ఇసుక ఉచితంగా లభిస్తున్నప్పటికీ ఆ ఇసుకను లబ్ధిదారులు ఇంటికి తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తూ ఉండడం, టన్నుకు 1300 రూపాయలు వరకు వసూలు చేస్తుండడం వంటి వాటిపై వైసీపీ( YCP ) అనేక విమర్శలు మొదలుపెట్టింది.
అయితే గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని కూటమి పార్టీల నేతలు సర్ది చెబుతున్నా.
వాస్తవంగా మాత్రం ఉచితంగా ఇసుక దొరకడం లేదు.ఈ విషయంలో జనాల్లోనూ అసంతృప్తి ఉండడం, చాలాచోట్ల ఎమ్మెల్యేలను ఈ విషయంపై జనాలు ప్రశ్నిస్తూ ఉండడంతో తాజాగా ఈ విషయాన్ని కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు( CM Chandrababu ) దృష్టికి తీసుకువెళ్లారు.
"""/" /
టిడిపి సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి,( Gorantla Butchaiah Chowdary ) మరో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు( Mla Jagan Mohan Rao ) ఉచిత ఇసుక సరఫరా విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఉచితంగా ఇసుక సరఫరా చేయడం లేదని, గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుకకు ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు కూడా అంతే అవుతుందనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి సదరు ఎమ్మెల్యేలు తీసుకెళ్లారట.
ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరేసరికి పాతదరే అవుతోందని , ఈ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఎమ్మెల్యే లు చంద్రబాబుకు తెలియజేశారట.
దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రస్తుతం ఇసుక రీచ్ లు పూర్తిస్థాయిలో తెరవకపోవడం వల్లే ఇసుక సరఫరాకు కొంత మొత్తంలో ఖర్చు అవుతుందని, స్టాక్ యార్డ్ లలో ఉన్న ఇసుక సరఫరా చేస్తుండడంతో ఖర్చు కనిపిస్తోందని , త్వరలోనే అన్ని సర్దుకుంటాయని, ఈ విషయంలో ఎవరూ కలుగజేసుకోవద్దని సదరు ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారట.
వారిద్దరూ కేబినెట్‌లో వద్దు .. డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతి నేత హెచ్చరిక