అధికార వైసీపీ మాత్రం దొడ్డిదారులు, దొంగదారులు వెతుక్కుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా టీడీపీ నాయకులు బలంగా ఉన్న చోట వైసీపీ ఎత్తుగడలు జుగుప్సాకరంగా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే.ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బలంగా ఉన్నారు.
ఇక, వైసీపీ ఇంచార్జ్‌గా రావి రామనాథం బాబు చక్రం తిప్పుతున్నారు.ప్రజల్లో ఏమాత్రం బలం లేని పరుచూరు వైసీపీ నాయకత్వం టీడీపీ ఎదుర్కొనే సత్తాలేక జిమ్మిక్కులకు తెరదీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆ మాటకు వస్తే రావి నాయకత్వంపై వైసీపీ నాయకత్వానికే ఇక్కడ అనుమానాలు ఉన్నాయి.
ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిని తాజాగా కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది.విషయం తెలిసి.