నిన్న అధినేత .. నేడు ఓ నేత : వైసీపీ అభ్యర్థికి ఓట్లేయమన్న టీడీపీ ఎమ్యెల్యే !

నిన్న తెలంగాణ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మహాకూటమిలో ఉంది అనే సంగతి మర్చిపోయి మరీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయవద్దు అంటూ.

చెప్పి నాలుక్కర్చుకున్నాడు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఏపీ ఎమ్యెల్యే ఒకరు వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థికి ఓట్లు వేయండి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం టీడీపీ లో కలకలం రేపింది.

అయితే ఆ టీడీపీ ఎమ్యెల్యే మాత్రం ఎదో ఏమరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశారంటే పోనీలే అనుకోవచ్చు కానీ అయన కులాభిమానంతో ఆ వ్యాఖ్యలు చేయడం టీడీపీలో పెద్ద చర్చకు దారి తీసింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇంతకీ విష్యం ఏంటి అంటే.టీడీపీ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి వచ్చే ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చాడు.

గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం జరిగింది.

ఆ సందర్భంగా టిడిపి ఎంఎల్ఏ మోదుగుల మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో రెడ్ల పరిస్ధితి మరీ దారుణంగా తయారైందన్నారు.

కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం తమ ఓట్లు వేసేటపుడు ఆలోచించుకుని ఓట్లేయాలని చెప్పారు.

తన పక్కనే కూర్చుని ఉన్న వైసిపి అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డిని చూపిస్తూ మనోడికే ఓట్లేసి గెలిపించమని చెప్పటం కలకలం రేపింది.