ఆ ఇథనాల్ కంపెనీ మాదే .. టీడీపీ ఎమ్మెల్యే ప్రకటన

ఆ ఇథనాల్ కంపెనీ మాదే టీడీపీ ఎమ్మెల్యే ప్రకటన

గత కొద్దిరోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad District ) ఇథనాల్ ఫ్యాక్టరీ కి( Ethanol Factory ) సంబంధించి కాంగ్రెస్,  బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వివాదం చోటుచేసుకుంది.

ఆ ఇథనాల్ కంపెనీ మాదే టీడీపీ ఎమ్మెల్యే ప్రకటన

ముఖ్యంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ కీలక నేత,  మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దే అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.

ఆ ఇథనాల్ కంపెనీ మాదే టీడీపీ ఎమ్మెల్యే ప్రకటన

ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కుటుంబంతో బంధుత్వం ఉన్నవారిదేనని , తలసాని కుమారుడు అందులో డైరెక్టర్ గా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఆ ఫ్యాక్టరీతో తమకు సంబంధం లేదని , ఇప్పటికే శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

అయినా కాంగ్రెస్ దీనిపై విమర్శలు చేస్తూనే ఉంది. """/" / ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫ్యాక్టరీ తమదేనని టిడిపి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్( MLA Putta Sudhakar Yadav ) ప్రకటించారు .

అది తమ కుమారుడు పుట్టా మహేష్( Putta Mahesh ) పెట్టిన కంపెనీ అని ప్రకటించారు.

పుట్టా మహేష్ ప్రస్తుతం ఏలూరు టిడిపి ఎంపీగా ఉన్నారు.ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో  ఈ ఫ్యాక్టరీ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతుండడంతో దీనిపై పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించి , అది తమదే అని ప్రకటించారు.

  ఈ ఇథనాల్ ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అని,  పూర్తి అనుమతులతో ఈ కంపెనీని నిర్మిస్తున్నామని పుట్టా సుధాకర్ ప్రకటించారు.

పరిశ్రమలపై కుట్రలు చేయడం సరికాదని పె, ట్టుబడులు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

  """/" / రాజకీయాల్లో భాగంగానే ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనకు కారణం అవుతున్నారని సుధాకర్ యాదవ్ మండిపడ్డారు.

ఇక బిఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ పైన కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.అనుమతులు పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని , ఇప్పుడు తమపై బురద జల్లుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

  అసలు ఈ ఇథనాల్ కంపెనీకి సంబంధించి మొత్తం వివరాలను బయటపెడతామని ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామని, దీనికి సంబంధించిన పనులను పూర్తిగా నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. రికార్డ్ అంటూ?