జ‌గ‌న్ గ‌ట్స్‌ను ఆకాశానికెత్తేసిన టీడీపీ ఎమ్మెల్యే

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు సొంత పార్టీ నేత‌ల్లోనే రోజు రోజుకు న‌మ్మ‌కం కోల్పోతున్న ప‌రిస్థితి చూస్తున్నాం.

ద‌శాబ్దాలుగా ఆయ‌న వెంట ఉన్న పార్టీ నేత‌లు, కేడ‌ర్‌, నాయ‌కులు అంద‌రూ కూడా బాబుకు దూర‌మ‌వుతున్నారు.

వీరంతా టీడీపీని వీడి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇత‌ర పార్టీల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

క‌ర‌ణం బ‌ల‌రాం టీడీపీ పుట్ట‌క ముందు నుంచే రాజ‌కీయాల్లో ఉన్నారు.అలాంటి నేత మొన్న ఎన్నిక‌ల్లో గెలిచి.

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబును వ‌దిలి వైసీపీలోకి వెళ్లారంటే పార్టీకి ఇక ఇక్క‌డ భ‌విష్య‌త్తు లేద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక బాబుతో ద‌శాబ్దాల నుంచి ఉన్న గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ కూడా ఇప్ప‌టికే పార్టీకి దూర‌మ‌య్యారు.

మ‌రో నేత అయిన విశాఖ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ సైతం పార్టీని వీడిన సంగ‌తి తెలిసిందే.

గ‌ణేష్ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా విజ‌యం సాధించారు.ఆయ‌న చంద్ర‌బాబు అనుంగు శిష్యుడిగా ద‌శాబ్దాల పాటు ఉన్నారు.

ఆయ‌న కూడా కొద్ది నెల‌ల క్రిత‌మే జ‌గ‌న్‌కు చేరువ అయ్యారు. """/"/ ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను నెల రోజుల క్రిత‌మే జ‌గ‌న్ దృష్టికి తీసుకు వెళ్లారు.

అంతే వంద‌ల కోట్ల రూపాయ‌లు విడుద‌ల కావ‌డంతో పాటు వాటికి భారీ ఎత్తున శంకుస్థాప‌న‌లు కూడా న‌డుస్తున్నాయి.

జ‌గ‌న్ వాసుప‌ల్లి గ‌ణేష్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు నిధులు విడుద‌ల చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.

దీంతో గ‌ణేష్ జ‌గ‌న్‌ను గ‌ట్స్ ఉన్న సీఎంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వంద కోట్ల‌తో హ‌ర్బ‌ర్ కు నిధులు విడుద‌ల చేసిన జ‌గన్ ఇప్పుడు ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు కూడా భారీగా నిధులు విడుద‌ల చేయ‌డంతో వాసుప‌ల్లితో పాటు విశాఖ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

దీంతో గ‌ణేష్ జ‌గ‌న్ లాంటి గ‌ట్స్ ఉన్న సీఎం దేశంలోనే లేడ‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జ‌గ‌న్‌కు ఉన్న త‌ప‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం అని ఆయ‌న కొనియాడేస్తున్నారు.

ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌కు షాక్ .. ఆ బాధ్యతల నుంచి తొలగింపు