బిజెపి పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి..!!

నిన్న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో 43 మంది చేత కొత్త క్యాబినెట్ ఏర్పాటు కావడం జరిగింది.

ఇక అదేరీతిలో రాష్ట్రపతి నివాసంలో సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది.

ఈ కొత్త క్యాబినెట్ లో యువతకు అదేరీతిలో మహిళలకు పెద్దపీట వేస్తూ కొంతమంది సీనియర్లకు బిజెపి పెద్దలు కల్పించడం జరిగింది.

ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక్క బీజేపీ నేతలకు కూడా పదవి రాకపోవడం బట్టి చూస్తే ఇప్పట్లో ఏపీలో ఎన్నికలు లేవు అన్నట్టు తెలుస్తుంది అన్న రీతిలో సోషల్ మీడియాలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఓహో.అదిరిందయ్యా పుష్పములు.

ఏపీలో ఇప్పట్లో ఎన్నికలు లేవనే విషయం అర్థమయింది' అని కూడా గోరంట్ల ట్వీట్ చేశారు.

"""/"/ ఎన్నికల అప్పుడు ఇంకా మరి కొన్ని సమయాల్లో రాజకీయాలు చేయాలని తపన తప్ప నిజంగా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని.

మళ్లీ మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప అప్పటి వరకు బిజెపి కరుణించదు అన్నట్టు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

వేసవికాలంలో చికెన్ తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!