టీడీపీ మైండ్ గేమ్.. చిక్కుల్లో జగన్ !

రోజురోజుకు ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధాన పార్టీలు.

సాధారణంగా ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీపైన పై చేయి సాధించాలంటే సరైన వ్యూహాలను అమలు చేయడం ఎంతో ముఖ్యం.

ఆ వ్యూహాల ద్వారా ప్రత్యర్థి పార్టీని డిఫెన్స్ లోకి నెట్టి తాము ఫోకస్ అయ్యేలా చూసుకుంటారు ఇతర పార్టీ నేతలు.

ప్రస్తుతం టీడీపీ( TDP ) వెస్తోన్న మైండ్ గేమ్ వ్యూహానికి వైసీపీ కాస్త డిఫెన్స్ లోకి వెల్లిందనే చెప్పాలి.

గత కొన్నాళ్లుగా అధికార వైసీపీలోని కొందరు ఎమ్మేల్యేలు అధిస్థానంపై దిక్కర స్వరం వినిపిస్తున్నారు.

ఆ విధంగా ఇటీవల వైసీపీలో నలుగురు ఎమ్మేల్యేలు రెబెల్స్ గా మారిన సంగతి తెలిసిందే.

"""/" / ఆ నలుగురికి కూడా టీడీపీ రెడ్ కార్పెట్ పరిచింది.త్వరలోనే ఆ నలుగురు టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంచితే బయటకు వచ్చిన ఎమ్మేల్యేలు వైసీపీపైన, సి‌ఎం జగన్(CM Jagan ) పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదే సందర్భంలో ఇంకా 30 నుంచి 42 మంది ఎమ్మేల్యేలు వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఏక్షణంలోనైనా పార్టీ నుంచి బయటకు రావచ్చని బాంబ్ పేల్చారు.

దీంతో వైసీపీ డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది.ఇంతకీ ఆ నలుగురు చెప్పిన వ్యాఖ్యలలో నిజానిజాలను పెక్కన పెడితే.

ఒకసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో రీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దానికి తోడు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ( YCP ) కంగు తినడంతో అసంతృప్త ఎమ్మేల్యేలు పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.

"""/" / ఈ నేపథ్యంలో ఇదే సరైన సమయమని భావించిన టీడీపీ శ్రేణులు మైండ్ గేమ్ కు తెర తీశారు.

వైసీపీలోని 40 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, వాళ్ళు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు( Atchannaidu ) చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆ నలబై మంది పేర్లు చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు.

మరి టీడీపీ శ్రేణులు చెబుతున్నట్లుగానే వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారా ? అనే చెప్పడం కష్టమే.

ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ అనిశ్చితి ఏర్పడిందనేది ఎవరు కాదనలేని విషయం.ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే కొంతమంది ఎమ్మేల్యేలు పార్టీ అసంతృప్తిగా ఉన్నారనే విషయం స్పష్టమౌతోంది.

మరి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.జంపింగ్ రాజకీయం ఊపందుకునే అవకాశం ఉంది.

మరి టీడీపీ చేస్తున్న మైండ్ గేమ్ కు జగన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.

అమ్మా బాబోయ్.. రేజీనా…సాయి ధరమ్ తేజ్..రెండు నిముషాల మ్యాగి కాదు అన్నమాట