తొందరపడి కూస్తున్న టిడిపి కోయిలలు !

తొందర పాడిన ఒక కోయిల ముందే కోసింది అన్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కన్నా తెలుగుదేశం అనుకూల మీడియా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తుంది.

ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కే ( Vemuri Radhakrishna )అయితే ముఖ్యమంత్రి అయ్యే అర్హత రేవంత్ రెడ్డి( Revanth Reddy)కి మాత్రమే ఉందని, రేవంత్ రెక్కల కష్టంతో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నట్లుగా అనేక వార్త కథనాలు ప్రసారం చేస్తూ ఉండటం గమనార్హం.

చంద్రబాబు కు అనుకూలం గా ఉండే రేవంత్ ముఖ్యమంత్రి అయితే అంతిమం గా తెలుగుదేశానికి మేలు జరుగుతుంది అన్న వ్యక్తి గత అజెండా తోనే ఆ మీడియా ఎలా వార్తలు ప్రసారం చేసుందని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు .

అయితే ఒక పార్టీ అంతర్గత వ్యవహారరాలలో స్తాయికి ముంచి వేలు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డికిజరిగే మంచి కన్నా చెడే ఎక్కువ అని ఇది కొత్త శత్రువులను పెంచుతుందని రేవంత్ అభిమానులు భావిస్తున్నారట .

"""/" / ముఖ్యంగా అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షుడు పదవి చేపట్టడం పైన ఇప్పటికే ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్న రేవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని దగ్గించుకోవడం లో కూడా పార్టీ సీనియర్ నాయకుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ అనుకూలంగా టిడిపి మీడియా ( TDP )చేస్తున్న హడావిడి వారి వైరి వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉందని, ఇది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్కు కొత్త ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

"""/" / అంతేకాకుండా రేవంత్ రెడ్డి ని చంద్రబాబు దగ్గరుండి గెలిపించారన్నట్లుగా, రేవంత్ రెడ్డి విజయం వెనక చంద్రబాబు ఉన్నారన్నట్టుగా కూడా కొన్ని వార్త విశ్లేషణలు ఈ మీడియాలు ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం.

సో రేవంత్ త్వరపడి పరిస్థితిని చక్కదిదక్కపోతే టిడిపి మీడియానే రేవంత్ కు కొత్త శత్రువుగా తయారు చేసే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు .

అయ్యా బాబోయ్.. ఈ కుర్రాళ్లు ఏంటి ఇంత స్పీడ్ గా వడ్డిస్తున్నారు (వీడియో)