కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
TeluguStop.com
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) తాజాగా కూటమి మేనిఫెస్టోను( Manifesto ) ప్రకటించగా మేనిఫెస్టో ప్రస్తుతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కూటమి మేనిఫెస్టో హామీలు అద్భుతంగా ఉన్నాయని ఆహా ఓహో అనేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే చంద్రబాబు పరిపాలన గురించి ఆయన స్వభావం గురించి తెలిసిన వాళ్లు అమలు చేయని హామీలను ఎన్ని ప్రకటిస్తే లాభం ఏంటని చెబుతున్నారు.
కూటమి తాజాగా చెప్పిన హామీలను అమలు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక( Sri Lanka ) కావడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటిస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమతువున్నాయి.
అధికారం కోసం బాబు ఎన్ని హామీలైనా ఇస్తారా అంటూ నెటిజన్లు చెబుతున్నారు. """/" /
కూటమి మెనిఫెస్టో వైసీపీ నవరత్నాల మేనిఫెస్టోకు( YCP Navaratnalu Manifesto ) కాపీ పేస్ట్ అని నెటిజన్లు వెల్లడిస్తున్నారు.
వైసీపీ నవరత్నాలలో భాగంగా ప్రకటించిన హామీలనే అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని కాంగ్రెస్ హామీలను మిక్స్ చేసి మేనిఫెస్టోను ప్రకటించారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ హామీలను ఎంతమంది నమ్ముతారో చూడాల్సి ఉంది.బాబు హామీలను నమ్మితే మోసపోవాల్సిందే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
"""/" /
సాధారణంగా ఆదాయం ఆధారంగా మేనిఫెస్టో ప్రిపేర్ అవుతుంది.చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో మాత్రం ఏ మాత్రం అవగాహన లేకుండా తయారు చేసిన మేనిఫెస్టో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కూటమికి మేనిఫెస్టో వల్ల లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది.కూటమి మేనిఫెస్టోను నిజంగా చంద్రబాబు అమలు చేస్తే ప్రజలు ఎవరూ పనులు చేయాల్సిన అవసరం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏ కోణాన చూసినా ఈ మేనిఫెస్టో అమలు చేయలేని మేనిఫెస్టో అని నెటిజన్లు చెబుతున్నారు.
తెలంగాణలో సాయంత్రం 4 గంటలకే చీకటయ్యే గ్రామం.. “క” మూవీకి ఆ గ్రామానికి లింక్ ఉందా?