కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు రోడ్లపై తిరగలేరు..: సజ్జల

ఏపీ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.అయితే తమ నిగ్రహాన్ని చేతకానితనంగా భావించవద్దని సజ్జల సూచించారు.

తాము కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు( TDP Leaders ) కనీసం రోడ్లపై కూడా తిరగలేరని తెలిపారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడులకు పాల్పడి.తిరిగి వాళ్లే ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు .ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సంయమనం పాటించాలని సజ్జల సూచించారు.

అదేవిధంగా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని తెలిపారు.

ప్రశాంత్ నీల్ మూవీలో తారక్ క్యారెక్టర్ ఇదే.. నరరూప రాక్షసుడిగా కనిపిస్తారా?