టిక్కెట్లపై బెంగ పెట్టుకున్న టీడీపీ నేతలు.. చంద్రబాబు కరుణిస్తారా?

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి.ప్రతి పార్టీ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టగా.టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తుంది.

జనసేన పార్టీ ప్రజావాణి, చేనేత రైతు భరోసా లాంటి కార్యక్రమాలను చేపట్టింది.అయితే అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నేతలందరూ తమ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

కానీ కొందరు వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందో లేదోనని బెంగపడుతున్నారు ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల్లో పలువురు నేతలు టిక్కెట్లపై బెంగ పెట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రెండు పార్టీలలోనూ గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవడం.ఉన్న నాయకులకు టికెట్లు ఇస్తారో లేదో అనే భయం వెంటాడుతోంది.

అధిష్టానానికి పలు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా తమకు మరోసారి టికెట్లు దక్కుతాయో లేదో అనే ధోరణిలో టెన్షన్ పడుతున్నారు.

ఇటీవల గడప గడపకు రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేల గ్రాఫ్ గురించి జగన్ ప్రధానంగా చర్చించారు.

రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగకపోతే టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనని జగన్ స్పష్టం చేశారు.

అయితే టీడీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది.ప్రజల్లో తిరుగుతున్న నేతలు కూడా టిక్కెట్ల గురించి టెన్షన్ పడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీ కోసం చాలా కష్టపడుతున్నామని.అయినా టికెట్ల విషయంలో తర్జన భర్జన కొనసాగుతోందని.

వచ్చే ఎన్నికల్లో ఇంత కష్టపడుతున్నా టికెట్లు దక్కుతాయో లేదో అనే విషయంలో క్లారిటీ లేదని పలువురు టీడీపీ నేతలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

"""/"/ అయితే టీడీపీ నేతలు ప్రజల మధ్య ఉండాలని.వారి సమస్యలు పట్టించుకోవాలని చంద్రబాబు కోరుతున్నా కొందరు నేతలు పెడచెవిన పెడుతుండంతో అధిష్టానం టిక్కెట్ల ఎలాంటి హామీని ఇవ్వలేకపోతోంది.

ఒకవేళ టిక్కెట్ ఖరారు చేసిన తర్వాత నియోజకవర్గాన్ని ఆయా నేతలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది.

అందుకే టీడీపీలో టిక్కెట్ల కేటాయింపు అనే అంశం తెరపైకి రావడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్