హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ వింత లాజిక్!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్ర దుమారం రేపుతుంది.

ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ తీవ్ర నిరసన తెలిపింది.అధికార పక్షం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని కోరుతూ బిల్లును ప్రవేశపెట్టగా, సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల నినాదాల మధ్య బిల్లు ఆమోదం పొందింది.

ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో వింత విశ్లేషణ ఇచ్చారు.

పేదలకు అధికంగా ప్రయోజనం చేకూర్చే హెల్త్ స్కిమ్స్‌ను తన తండ్రి వైఎస్ఆర్ తీసుకోచ్చరన్నారు.

అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం అన్నారు.తన తండ్రి హయాంలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, ఆరోగ్యశ్రీ, 108 సేవలు వంటి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారని అందుకే ఎన్టీఆర్ యూనివర్సిటీకి మాజీ ముఖ్యమంత్రి పేరును మార్చడం సముచితంగా భావించమని జగన్ అన్నారు.

అయితే జగన్ ఈ వింత లాజిక్ ఏంటో అర్ధం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం సముచితం అనుకుంటే 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించిన సత్యం రామలింగరాజు పేరు పెట్టాలంటూ విమర్శిస్తున్నారు.

"""/" / USలోని 911 అత్యవసర సేవల స్ఫూర్తితో ఈ సేవలను రామలింగరాజు ప్రారంభించారని కానీ వైఎస్‌ఆర్‌కు క్రెడిట్‌ వచ్చిందని, యూనివర్సిటీ పేరు మార్చడం వెనుక అంబులెన్స్‌ సేవలే కారణమని జగన్‌ చెబుతున్నారు.

పైగా తన తండ్రి ముఖ్యమంత్రి కాకముందు వృత్తి రీత్యా వైద్యుడని, పేదలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్నారన్నారు.

మరీ యూనివర్శిటీకి పేరు మార్చడానికి పేదల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాలే పరమావధి అనుకుంటే, అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రులు ఎందరో ఉన్నారు.

ఎన్టీఆర్ పేరును మార్చాలనుకుంటే నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, జలగం వెంగళరావు వంటి వారు పేదలకు మేలు చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

"""/" / కానీ జగన్ వారు పేరు కాకుండా తన తండ్రి పేరునే ఎందుకు ఎంచుకుంటున్నారని అంటున్నారు.

ఇతర ముఖ్యమంత్రులు మెడికల్ కాలేజీలు తీసుకురానట్లుగా జగన్ తన తండ్రి మెడికల్ కాలేజీలు తెచ్చారని జగన్ గొప్పగా మాట్లాడారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ప్లాన్ చేసి నిర్మించినా ఎన్టీఆర్‌ను కాదని జగన్ తన తండ్రి పేరును ఎందకు పెట్టుకున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు.

వాస్తవాలను విస్మరించి, చాలా ఆలోచించి మేధోమథనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

దీనిపై జ‌గ‌న్ ప్ర‌స్తావించిన విశే్ల‌ల‌లో కొంత లోపం ఉంది.

ఎన్ఆర్ఐలకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారు..: కొడాలి నాని