అప్పుడు మీరు .. ఇప్పుడు వారు  ! రిటర్న్ గిఫ్ట్ అంటే ఇదే బాసూ 

ఏపీలో టిడిపి ప్రభుత్వం( TDP Govt ) ఏర్పడిన తరువాత వైసిపి నాయకులను టార్గెట్ చేసుకుని అనేక దాడులు , కేసులు నమోదు చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చసుకున్నాయి.

  దీనిపైనే తాజాగా వైసిపి అధినేత జగన్( YS Jagan ) తీవ్రంగా స్పందించారు.

  నిన్న నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు .

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపి కూటమి ప్రభుత్వం వైసిపి నేతలని టార్గెట్ చేసుకోవడంపై జగన్ స్పందించారు.

కొత్త ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు.  జగన్ వ్యాఖ్యలపై టిడిపి తీవ్రంగానే స్పందించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు జగన్ కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.

గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి నేతలను వెంటాడి వేధించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు.

"""/" / టిడిపి కీలక నాయకులతో పాటు,  నియోజకవర్గ , మండల , గ్రామ స్థాయి నాయకులను ఏ విధంగా వేధింపులకు గురి చేశారు.

ఎన్ని కేసుల్లో ఇరికించారు అనే విషయం పైన సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.

వైసిపి( YCP ) ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు టిడిపి నేతలకు చుక్కలు చూపించడంతోనే ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపిని అంతే స్థాయిలో టార్గెట్ చేస్తుందని , దెబ్బకు దెబ్బ అంటూ టిడిపి గట్టిగానే వాదిస్తోంది.

రిటర్న్ గిఫ్ట్( Return Gift ) అంటే ఇదే అంటూ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుత మంత్రులు అచ్చెన్న నాయుడు , టిడి జనార్ధన్,  కొల్లు రవీంద్ర తో పాటు , మరింత మంది నాయకుల నమోదు చేసిన కేసుల వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు.

అచ్చెన్న ను( Atchennaidu ) ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఈ బాధ గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు .

"""/" / కొల్లు రవీంద్ర పై( Kollu Ravindra ) హత్యాయత్నం కేసు పెట్టి రాజమండ్రి జైలుకు తరలించిన విషయాన్ని మర్చిపోయావా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

  అలాగే బీసీ జనార్దన్ రెడ్డిని జిల్లా మార్చి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అలాగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై వేధింపులకు పాల్పడడం,  టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడులు చేయడం,  దీనిపై ఒకరి పైన కేసు నమోదు చేయకపోవడాన్ని ఇప్పుడు టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ) నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో 52 రోజులపాటు ఉండేలా చేయడాన్ని గుర్తు చేస్తున్నారు.

అధికారంలో ఉండగా ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడి ఇప్పుడు అధికారం పోగానే బాధ వచ్చిందా జగన్ అంటూ టిడిపి శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?