ఆ ‘చివరి తప్పూ ‘ చేసేశారా బాబు ? 

పార్టీని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని టిడిపి అధినేత చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది.

రాబోయే ఎన్నికల్లో పార్టీ  అధికారంలోకి రాకపోతే ఇక ఎప్పటికీ ఆ ఆశ తీరదని, పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతుందనే భయం చంద్రబాబును వెంటాడుతోంది.

అందుకే తనకు ఇవే చివరి ఎన్నికలని కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చివరి ఎన్నికల అంటూ చంద్రబాబు సెంటిమెంటును రగల్చడం ద్వారా,  ప్రజల నుంచి సానుభూతిని పొందాలని , తద్వారా టిడిపి అధికారంలోకి వచ్చేలా చేసుకోవాలనేది బాబు ఎత్తుగడ అని అంతా భావిస్తున్నారు.

అసలు జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ ఈ స్థాయిలో బలంగా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయకత్వం గొప్పతనమే కారణం.

చంద్రబాబు మీద భరోసాతోనే, పార్టీ అధికారంలోకి లేకపోయినా తమలో నిరాశా, నిస్పృహలు  అలుమ్ముకున్నా,  ఎప్పటికైనా పార్టీని అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకంతో చాలామంది నాయకులు యాక్టివ్ గానే ఉంటున్నారు.

గతంతో పోలిస్తే టిడిపి నాయకులంతా దాదాపు యాక్టివ్ అయ్యారు.వైసిపి ప్రభుత్వంను ఇరుకున పెట్టే విషయంలో పై చేయి సాధిస్తున్నారు.

ఒకవేళ 2024 ఎన్నికల ఫలితాలు కూడా బోల్తా కొడితే చంద్రబాబు క్రియశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటే అప్పుడు టిడిపి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆ పార్టీ నాయకులందరిలోనూ వ్యక్తం అవుతుంది.

చంద్రబాబు తరహాలో పార్టీని ముందుకు నడిపించగల సమర్థుడైన నాయకుడు ఎవరూ లేరనే విషయాన్ని టిడిపి నాయకులు గుర్తుచేసుకుంటున్నారు.

"""/"/ మారుతున్న రాజకీయ పరిస్థితులను అనుకూలంగా తమ వ్యూహాలను మార్చుకుంటూ,  పై చేయి సాధించడంలో చంద్రబాబు బాగా ఆరితేరారు.

ఆయన సారధ్యంలోనే పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఆ పార్టీ నాయకులంతా ఉన్నారు.

కానీ చంద్రబాబు కర్నూలు సభలో ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ చెప్పడం పార్టీ క్యాడర్ లో అలజడి రేపింది.

ఆ అలజడి ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ బాబు సానుభూతి కోసం చెప్పినా .

పార్టీకి నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .

అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ సినిమాతో సక్సెస్ సాధించాడా..?