తమ్ముళ్లు ట్రాక్ తప్పుతున్నారా ? బాబు ని లెక్కచేయడం లేదా ?
TeluguStop.com
తెలుగు తమ్ముళ్లలో మునుపటి ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు అనే బాధ చంద్రబాబులో రోజురోజుకు పెరుగుతోంది.
పార్టీ అధికారంలో లేకపోవడం, వైసిపి ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ నాయకులు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు.
పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇస్తే పట్టుమని పది మంది నాయకులు కూడా పొగవడం కష్టంగా మారుతోంది.
స్వయంగా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా తెలుగు తమ్ముళ్లు లెక్క చేయని పరిస్థితి ప్రస్తుతం తెలుగుదేశంలో నెలకొంది.
ఒక వైపు చూస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు సమయం తరుముకొస్తోంది.ఎన్నికల్లో తమ బలం నిరూపించుకుంటే కానీ అధికార పార్టీ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది అని నిరూపించుకోవడానికి అవకాశం ఉండదు.
"""/"/కానీ పార్టీ క్యాడర్ మాత్రం ఈ సమయంలో ముందుకు వచ్చేందుకు వెనుకడుగు వీస్తుండడం బాబును ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవల ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో చంద్రబాబు స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది.
అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు.
కానీ తెలుగు తమ్ముళ్లు నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.రాష్ట్రంలో ఎక్కడా నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కేడర్ పాల్గొనడం లేదు.
అంతెందుకు చంద్రబాబు స్వయంగా పిలుపు ఇచ్చినా రెస్పాన్స్ రాలేదు.తిరుపతిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి పది మంది కార్యకర్తలు కూడా హాజరుకాకపోవడం బాబుకు మింగుడు పడడం లేదు.
"""/"/పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు కూడా ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, సత్య ప్రభ, సి.
కె.బాబు వంటి బలమైన నాయకులు ఉన్నా నిరసన కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి వీరంతా రోడ్డెక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
పార్టీలో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు చంద్రబాబు అనేక చోట్ల గతంలో పర్యటనలు చేశారు.
అప్పట్లో రెస్పాన్స్ కూడా బాగానే వచ్చినట్టు కనిపించింది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆందోళన కార్యక్రమాలు అనగానే కేసులు, కోర్టులు అనే భయంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్వయంగా చంద్ర బాబు రంగంలోకి దిగి కార్యకర్తలు ఉత్సాహం పెంచేలా పర్యటనలు, సభల గాని ఏర్పాటు చేయకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదు.
రూ.1000తో బాలిలో ఏం దొరుకుతుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..