సీఎస్ జవహర్ రెడ్డితో టీడీపీ నేతల బృందం భేటీ
TeluguStop.com
అమరావతి: సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) టీడీపీ నేతల బృందం భేటీ.
పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపణ.
ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా ఆదేశాలివ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరిన టీడీపీ నేతల బృందం.
వర్ల రామయ్య,( Varla Ramaiah ) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.తాము ఓడిపోతున్నామనే విషయం జగనుకు తెలుసు.
చివరి అవకాశంగా జగన్ టీడీపీపై కుట్రలు పన్నుతున్నారు.వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయమంటే చంద్రబాబుకేెం సంబంధం.
?పెన్షన్లు చంద్రబాబు ఎలా బాధ్యుడు అవుతారు.?ఒక్క అవ్వా తాతకు కూడా పెన్షన్ దక్కాల్సిందే.
ఈసీ ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలి.అందరికీ పెన్షన్లు అందేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరాం.
పెన్షన్ నిధులు ఖజానాలో ఉన్నాయా.? లేవా అని సీఎస్ జవహర్ రెడ్డిని అడిగాం.
అవసరమైన నిధులు ఉన్నాయని సీఎస్ చెప్పారు.ఇంటికే వచ్చి పెన్షన్.
నక్కా ఆనందబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.పెన్షన్లు రాకపోవడానికి కారణం చంద్రబాబేనని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సెక్రటేరీయేట్ వ్యవస్థ ద్వారా రెండు గంటల్లో పెన్షన్ పంపిణీ చేయొచ్చు.పెన్షన్లు సరిగా అందనీయొద్దని జగన్ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు.
పెన్షన్ల పంపిణీ చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరాం.ఈసీ నిబంధనలకు విరుద్దంగా సెర్ప్ సీఈఓ సర్కులర్ ఉందనే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లాం.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే