అలాంటి టీడీపీ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్లు వేస్తున్న త‌మ్ముళ్లు..

ఏపీలో ఇప్పుడు టీడీపీ కొంద‌రు సొంత నేత‌లే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.త‌మ వ్యాఖ్య‌ల‌తో పార్టీని దిగ‌జారుస్తున్నారు.

ఇంకొంద‌రు అయితే వైసీపీ పార్టీ నేత‌ల‌ను క‌లుస్తూ చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతున్నారు.ఇక టీడీపీలో ఎప్ప‌టి నుంచో చాలా డిఫ‌రెంట్ స్టైల్‌లో మాట్లాడే నేత‌లుగా జేసీ బ్రదర్స్ తీరు ఉంటుంది.

కాగా ఒక్ప‌ప్పుడు ఎన్నో ర‌కాల సంచలన వ్యాఖ్యలు చేసిన‌టువంటి జేసీ దివాకర్ రెడ్డి చాలా రోజులుగా మీడియా ముందుకు రావ‌ట్లేదు.

కానీ ప్ర‌స్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచ‌న‌టువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం నిత్యం పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారు.

అయితే ఆయ‌న పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయ‌క‌త్వంపై పార్టీ భ‌విష్య‌త్ పై చేస్తున్న వ్యాఖ్యల‌పై టీడీపీ తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.

ఇక ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై అయితే ఓ రేంజ్‌లో ఆగ్రహం ఉన్నారు.జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇటీవ‌ల మాటాడుతూ ఇప్ప‌టికిప్పుడు గ‌న‌క ఎన్నిక‌లు వ‌స్తే మాత్రం పార్టీ గెలిచే పరిస్థితి లేదని, చంద్రబాబు నాయ‌క‌త్వాన్ని అలాగే పార్టీ భ‌విష్య‌త్‌పై కార్య‌క‌ర్త‌ల‌కు న‌మ్మకం లేద‌ని చెప్పారు.

దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై తెలుగు త‌మ్ముళ్లు తీవ్రంగా మండిప‌డుతూనే ఉన్నారు. """/"/ ఇక పోతే రీసెంట్‌గా అనంత‌పురంకు చెందిన మాజీ మంత్రి ప‌ల్లె ర‌గునాథ‌రెడ్డి కూడా ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని క‌ల‌వ‌డంతో టీడీపీ భ‌గ్గుమంటోంది.

ఈ జిల్లాకు చెందిన‌టువంటి టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

వెల్లాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ్చ‌ని, అంతేగానీ ఇలా పార్టీలో ఉంటూ పార్టీని దిగ‌జార్చే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని సూచిస్తున్నారు.

ఇక ముందు కూడా ఇలా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు ఎవ‌రు పాల్పడినా స‌రే వారిపై ఇలాగే ఫైర్ అయ్యే విధంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌నిపిస్తున్నారు.

ఇది పార్టీకి మంచిదే అంటున్నారు విశ్లేష‌కులు.

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!