ఆగండి ఆగండి తమ్ముళ్లూ : బాబు ముందే కొట్టుకున్న నాయకులు

ఆగండి ఆగండి తమ్ముళ్లూ : బాబు ముందే కొట్టుకున్న నాయకులు

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ క్రమశిక్షణ పూర్తిగా తప్పినట్టు కనిపిస్తోంది.

ఆగండి ఆగండి తమ్ముళ్లూ : బాబు ముందే కొట్టుకున్న నాయకులు

ఎవరికి వారు తాము గొప్ప అంటే తాము గొప్ప అనుకుంటూ పార్టీ క్రమశిక్షణ తప్పుతున్నారు.

ఆగండి ఆగండి తమ్ముళ్లూ : బాబు ముందే కొట్టుకున్న నాయకులు

సాక్షాత్తు అధినేత చంద్రబాబు ముందే తన్నులాడుకుంటూ పార్టీలో క్రమ శిక్షణ లోపించింది అనే విషయాన్ని మరోసారి గుర్తు చేసారు.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు.స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జిరిగిన కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి 15వ డివిజన్ ఇన్‌చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడంతో అంతా షాక్ అయ్యారు.

ఈ సందర్భంగా సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కోవడంతో పాటు చంద్రబాబు సమక్షంలోనే సుబ్బయ్యపై శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడులు చేశారు.

అయితే ఈ హఠాత్పరిణామానికి చంద్రబాబు కూడా షాక్ అయ్యారు.అయితే ఈ గొడవను సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా బాబు చేయలేదు.

దీంతో రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, మరో ఎనిమిది మంది అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల మధ్య భారీ పోటీ నడుస్తుందా..?