జగన్ ను హత్య చేసేందుకే టీడీపీ నేతల కుట్ర..: వెల్లంపల్లి

వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ( Vellampalli Srinvias )కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ ను హత్య చేసేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ పై రాయి దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమ( Bonda Uma ) హస్తం ఉందని వెల్లంపల్లి ఆరోపణలు చేశారు.

జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని పేర్కొన్నారు.దాడికి సంబంధించి ఆధారాలు దొరుకుతాయని చెప్పారు.

గులకరాయి అంటూ చంద్రబాబు హేళన చేస్తున్నారన్న వెల్లంపల్లి తామే రాయితో కొట్టించుకున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎవరైనా సున్నితమైన కంటికి గాయం చేసుకుంటారా? లేక ఎవరైనా చావును కొనితెచ్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ పక్కనే ఉన్న తనకు కూడా గాయమైందని తెలిపారు.జూన్ 4న మీ అంతు చూస్తామని మాట్లాడుతున్నారన్న వెల్లంపల్లి అధికారులను కూడా బోండా ఉమ( Bonda Uma ) బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే నిందితుడిని బోండా ఉమ ప్రభావితం చేసి ఉండొచ్చని తెలిపారు.బోండా ఉమ బెదిరింపులను సుమోటోగా తీసుకోవాలని ఆయన కోరారు.

బన్నీ శాపం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరమైందా.. ఆ మార్క్ ను తారక్ టచ్ చేశారా?