పిన్నెల్లి పై అనర్హత వేటు వేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..!!

ఏపీలో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( MLA Pinnelli Ramakrishna Reddy ) ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటపడటం సంచలనంగా మారింది.

ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్( Election Commission ) ఎంతో సీరియస్ అయింది.

దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.

అయితే ఈ ఘటనపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి( Julakanti Brahma Reddy ) స్పందించారు.

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.పిన్నెల్లి పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీని టీడీపీ నేతలు కోరడం జరిగింది.

అనంతరం బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిన్నెల్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్నారు.పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో గొడవకు కారణం ఎమ్మెల్యేనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావు పై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమని ఆరోపించారు.

పోలింగ్ కి ముందు ఆ తర్వాత నియోజకవర్గంలో జరిగిన అనేక గొడవలకు సంబంధించి ఎమ్మెల్యే హస్తము ఉందంటూ ఆరోపణలు చేశారు.

దాడులు చేస్తామని చెప్పి మరి.గొడవలకు దిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా పోలీసులకు సవాలు చేసి మరి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని బ్రహ్మారెడ్డి కామెంట్లు చేశారు.

రాష్ట్ర డీజీపీని కలిసిన వారిలో బ్రహ్మరెడ్డితో పాటు దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.

వైరల్ వీడియో: వరుడు డాన్స్ చేస్తుండగా.. మొత్తం పరువు తీసావు కదయ్యా..