వైసీపీ నేతలకు టీడీపీ నేత వర్ల రామయ్య సవాల్
TeluguStop.com
వైసీపీ నేతలకు టీడీపీ నేత వర్ల రామయ్య సవాల్ విసిరారు.ఇటీవల టీడీపీ ప్రచురించిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
బహిరంగ చర్చకు ప్లేస్, టైం, డేట్ మీరు చెప్పినా సరే.మమ్మల్ని చెప్పమన్నా సరేనంటూ వర్ల రామయ్య వ్యాఖ్యనించారు.
తమ పార్టీ నుంచి ఇద్దరం వస్తామని వైసీపీ నుంచి ఇద్దర్నీ పంపాలని చెప్పారు.
ముగ్గురు సీనియర్ అడ్వొకేట్ల సమక్షంలో ప్రజాక్షేత్రంలో చర్చిద్దామని స్పష్టం చేశారు.అదేవిధంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ పాత్రపై ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు.
విశాల్ ఆరోగ్యం గురించి రియాక్ట్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అసలేం జరిగిందంటే?