మంత్రి కాకాణిపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు

వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.

కాకాణి మంత్రిగా ఉండటం ప్రజల కర్మని అన్నారు.కాకాణికి వర్షాలకు, అకాల వర్షాలకు తేడా కూడా తెలియదని విమర్శించారు.

కానీ విమర్శించిన వారిపై మాత్రం కాకాణి నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు.వర్షాలు, పంట నష్టాలపై సమీక్షలు చేయడం లేదన్నారు.

ఇరిగేషన్, అగ్రికల్చర్ శాఖలను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు.అంతేకాకుండా రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని వెల్లడించారు.

కౌన్సిలర్ ముసుగులో చీకటి యవ్వారాలు.. అమెరికాలో భారత సంతతి నేతపై కేసు