టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్
TeluguStop.com

టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.కియా పరిశ్రమ వద్ద లోకేశ్ యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్ల మైలురాయి దాటింది.


ఈ సందర్బంగా నారా లోకేశ్ మాట్లాడుతూ కియా పరిశ్రమ చంద్రబాబు ఘనతని చెప్పారు.


కియాతో 25 వేల ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని సీఎం జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు.
పరోక్షంగా లక్షలాది మందికి కియా ద్వారా లబ్ధి చేకూరలేదా అని నిలదీశారు.అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని విమర్శించారు.
నాలుగేళ్లలో తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ ముందైనా జగన్ సెల్ఫీ దిగి చూపగలరా అని సవాల్ చేశారు.
టీడీపీ హయాంలో వేలాది పరిశ్రమల ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ… ఖుషి అవుతున్న మెగా ఫాన్స్!