గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బుధవారం గుంటూరులో( Guntur ) ప్రజాగళం సభ ( Prajagalam Meeting ) నిర్వహించారు.

ఈ క్రమంలో ఊహించని విధంగా ర్యాలీకి మంచి స్పందన వచ్చిందని ప్రజలను అభినందించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న పిల్లలు కూడా సభలకు హాజరు కావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.

గుంటూరులో స్పందన చూస్తుంటే సైకో పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కనిపిస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

హైదరాబాదు సికింద్రాబాద్ వంటి నగరాలు ఉండగా సైబరాబాద్ నిర్మించి దాని చుట్టూ ప్రక్కల 125 కిలోమీటర్లు రింగ్ రోడ్డు వేసి.

గ్రామాలు, మున్సిపాలిటీలు అనుసంధానం చేసి ఒక మహానగరం అప్పట్లో నిర్మించడం జరిగింది. """/" / వైసీపీ( YCP ) రాకపోయి ఉంటే అమరావతి కొనసాగి ఉంటే.

గుంటూరు మరింతగా అభివృద్ధి చెందేదని అన్నారు.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు.

ఆ రకంగా అభివృద్ధి చేయాలని కలలు కంటే ఈ వైసీపీ.మొత్తం విచ్ఛిన్నం చేసిందని అసహనం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో పలు హామీలు ప్రకటించారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ,( DSC ) రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) రద్దుపై చేస్తానని చంద్రబాబు చెప్పారు.

'మొన్నటి వరకు బలవంతంగా సెటిల్మెంట్లు చేసి ఆస్తులు రాయించుకున్నారు.ఇప్పుడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారు.

మీ భూమిపైన జగన్ ఫొటో ఎందుకు? మీకు జగన్ తాత భూమి ఇచ్చాడా? రేపటి నుంచి మీ భూమి.

మీది కాదు.మనందరం బానిసలుగా ఉండాల్సి వస్తుంది' అని వ్యాఖ్యానించారు.

జీవితంలోకి స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు… ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?