టీడీపీ నేత దేవినేని ఉమ హాట్ కామెంట్స్

అమరావతిలోని గొల్లపూడిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు రక్తదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలో రోడ్డుపైనే టీడీపీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది.గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయానికి అధికారులు తాళం వేయడంతో రోడ్డుపైనే ఆ పార్టీ నేతలు మాజీమంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నానిలు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బ్లడ్ డొనేషన్ కు ప్రభుత్వం బెడ్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.

ఈ క్రమంలో ప్రభుత్వ తీరు తెలియాలనే రోడ్డుపైనే రక్తదాన కార్యక్రమం చేపట్టామన్నారు.అదేవిధంగా లోకేశ్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ అడుగులో అడుగేస్తారని చెప్పారు.

జగన్ ఎన్ని తప్పుడు ఆర్డర్లు ఇచ్చినా యువగళం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

పార్టీలో లుకలుకలపై మాట్లాడే సమయం ఇప్పుడు కాదని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 1, శనివారం 2025