రైతులతో కలిసి మొక్కజొన్న కల్లాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ

రైతులతో కలిసి మొక్కజొన్న కల్లాలను పరిశీలించిన మాజీ మంత్రి దేవినేని ఉమ( Devineni Uma ).

మొక్కజొన్న( Corn )కు 1962 మద్దతు ధర అని రైతులను నమ్మించి తాడేపల్లి కొంపలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మూసుకుని కూర్చున్నారు.

రైతులను దళారులకు అప్పచెప్పారు.పక్క రాష్ట్రాల నుంచి దళారులు వచ్చి 1500 కు దోచేస్తుంటే ఎందుకయ్యా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ! మొక్కజొన్న రైతులకు ఇదేం ఖర్మ ! ప్రజా ప్రతినిధులు ఎందుకు ఇంత అసమర్ధులయ్యారు ? .

మార్క్ ఫెడ్ ను ఎందుకు రంగంలో దింపలేకపోయారు ? ప్రైవేటు వ్యక్తులు మార్క్ఫెడ్ పోటీ పడితే 2200 రేటు 2500 దక్కుతుంది.

1500 లకు దోచేస్తుంటే ఎమ్మెల్యే, మంత్రులు ఎందుకు మూసుకుని కూర్చున్నారు? ముఖ్యమంత్రి నోరు తెరవడు ! .

ధరల స్థిరీకరణ నిధి 3వేల కోట్లు విపత్తుల నిధి 4 వేల కోట్లు వెరసి 7వేల కోట్లు నిధులు ఏమయ్యాయి ? రైతు భరోసా కేంద్రాలు( Raithu Barosa Centers ) బోగస్ ! ఇటువంటి వారు కోటలో ఉంటే ఏంటి పేటలో ఉంటే ఏంటి ? చేతగాని వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు? రైతుల కళ్ల వెంట నీళ్లు కాదు రక్తం కారుతుంది ! .

బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను కాపాడాలా ! తమ్ముడు అవినాష్ రెడ్డి( Avinash Reddy ) అరెస్టు కాకూడదు ఎంతసేపు ఇదే గోల తెదేపా నాయకులు కార్యకర్తలు మీద కేసులు పెట్టి రౌడీషీట్లు.

! ఎర్రమనాయుడు గారు అల్లుడు వియ్యంకుడుని సీబీసీఐడి వాళ్ళు తీసుకువెళ్లి తీసుకువెళ్లి తప్పుడు కేసులు రామోజీరావు గారు మార్గదర్శిపై తప్పుడు కేసులు ! రాష్ట్రంలో ఎవరు వ్యాపారాలు చేయకూడదు.

లిక్కర్, ఇసుక దోపిడీ డబ్బులు మొత్తం నీకే రావాలి చివరకు రైతులను కూడా దళారులకు అప్పజెప్పి రైతు ద్రోహిగా మిగిలాడు .

1500 రావాల్సిన ధాన్యం బస్తా రంగాపురంలో 1100కు కొట్టుకుపోయారు ఎందుకు మీ బతుకు చెడ మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నువ్వు ఒక ముఖ్యమంత్రివి! అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి చంద్రబాబును దేవినేని ఉమాను తిడితే సరిపోదు.

వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది… రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!