వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు.. లేదంటే పార్టీకి కష్టాలే..?
TeluguStop.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది.
తెలంగాణలో అయితే పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలోనే ఏపీలోనైనా టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు, నేతలు ప్రయత్నిస్తున్నారు.
సొంత పార్టీలో పని చేయని నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయని వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన సంగతి అందరికీ విదితమే.అయితే, కొంత మంది మాత్రమే టీడీపీ నుంచి విజయం సాధించారు.
ఇందులో కొందరు పార్టీ అభివృద్ధికి పాటు పడకుంగా సొంత పనులను చక్కబెట్టేందుకు అధికార పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అందులో విజయవాడ ఎంపీ నాని, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పేర్లు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
వీరిలో ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్తున్నట్లు వార్తలొచ్చాయి.కానీ, అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు.
తాము టీడీపీలో ఉన్నామని పేర్కొంటున్నారు.తాజాగా చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసిన సందర్భంలో కాని, టీడీపీ నేతలు చేసే ఆందోళనల్లో కాని ఈ ఇద్దరు నాయకులు పాల్గొనడం లేదు.
మిగిలిన వారు అందరు పలు విషయాలపై స్పందించినప్పటికీ గంటా శ్రీనివాస్, కేశినేని నాని మౌన ముద్ర దాల్చారు.
ఈ క్రమంలో వీరిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ టీడీపీ వర్గాల నుంచి వినబడుతోంది.
వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా ముద్దు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుందని కొందరు టీడీపీ క్షేత్రస్థాయి నేతలు హెచ్చరిస్తున్నారు కూడా.
ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి.. తెర వెనుక రంగం సిద్ధం