చిత్తూరు పీఎస్లో లొంగిపోయిన టీడీపీ నేత చల్లా బాబు
TeluguStop.com
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ నేత చల్లా బాబు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని తెలుస్తోంది.
ఈ మేరకు చల్లా బాబు చిత్తూరు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు.
ఇటీవల పుంగనూరులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో చల్లా బాబు నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనలోని ఏడు కేసుల్లో చల్లా బాబు ముద్దాయిగా ఉన్నారని తెలుస్తోంది.
వీటిలోని నాలుగు కేసుల్లో బెయిల్ రాగా మరో మూడు కేసులో హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
దీంతో చల్లా బాబు సహా పలువురు టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని సమాచారం.
పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?