కొడాలి నానికి అయ్యన్న పాత్రుడు పంచ్.. ఈ వయసులో రేప్ కేసులా?

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు టీడీపీ నేతలను, చంద్రబాబును ఓ రేంజ్‌లో ఏకిపారేస్తుంటారు.

ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి పదం వస్తుందో కూడా ఊహించడం కష్టమే.

అందుకే వైసీపీలో ఆయన్ను ఫైర్‌బ్రాండ్‌గా అభివర్ణిస్తుంటారు.తాజాగా కొడాలి నాని ఇలాకాలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి పంచ్‌ల పంచ్‌లు వేశారు.

కొడాలి నాని పెద్ద దొంగ అని.నాడు ఎన్టీఆర్ మోచేతి నీళ్లు తాగి.

నేడు చంద్రబాబును విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు.మూడేళ్ల పాటు కొడాలి నాని పని చేసిన మంత్రి శాఖ గురించి కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.

ఆనాడు చంద్రబాబు సీటు ఇవ్వకపోతే ఈనాడు ఆయన గతి ఏమయ్యేదని నిలదీశారు.సన్నబియ్యం విషయంలో మాట మార్చిన వ్యక్తి అంటూ ఎద్దేవా చేశారు.

తనపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కేసులు పెట్టిందని.అయినా తాను భయపడేది లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

ఈ వయసులో తన మీద రేప్ కేసులు పెట్టిన వైసీపీని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని మండిపడ్డారు.

టీడీపీ ఒక ప్రభంజనమని.ఎపుడు ఎన్నికలు జరిగినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

టీడీపీ కోసం అవసరమైతే చావడానికైనా తాను రెడీ అని ప్రకటించారు. """/" / అయ్యన్నపాత్రుడు మాటలు విన్నాక టీడీపీ అభిమానులు అయ్యన్నా.

మజాకా అని ప్రశంసలు కురిపిస్తున్నారు.కొడాలి నానికి మొగుడు అయ్యన్నపాత్రుడేనని అభిప్రాయపడుతున్నారు.

తాను పార్టీ కోసం ఏమైనా చేస్తాను అన్న అయ్యన్నపాత్రుడు డైలాగులు మాత్రం ఇపుడు పార్టీ లోపల, బయటా తెగ వైరల్ అవుతున్నాయి.

ఆరున్నర పదుల వయసులోనూ అయ్యన్నలో ఫైర్ తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. .

క్రేజీ ఐడియా.. వంట గదిలో ఉక్కుపోతకు భలే చెక్ పెట్టావు గురు..