వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్

ఏపీకి సీఎం జగన్ ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్ర ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని తెలిపారు.

బీసీ మంత్రులు విజయసాయిరెడ్డి దగ్గర ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.కక్ష పూరితంగానే అమరరాజా బ్యాటరీ పరిశ్రమను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు.

అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.