బాబు పై ' ముద్రగడ ' విమర్శలు ... టీడీపీ కాపు  నేతల సైలెన్స్ ఎందుకో ?

ఏదైనా రాజకీయ పార్టీ పైన , ఆ పార్టీ నాయకుల పైన మరో పార్టీకి చెందిన వారు విమర్శలు చేస్తే దానికి కౌంటర్ గా  అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కౌంటర్ ఇస్తూ ఉంటారు.

ఇది అన్ని పార్టీల్లోనూ జరిగే వ్యవహారమే.ఏ సామాజికవర్గం నాయకుడు విమర్శలు చేసినా, దానికి అదే సామాజిక వర్గం లోని మరో పార్టీ నాయకుడు రియాక్ట్ అయ్యి గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటారు.

ఇదంతా రాజకీయాల్లో షరా మామూలు వ్యవహారమే.కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అసెంబ్లీ లో ఘోర అవమానం జరిగిందని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి బోరున విలపించారు.

దీనికి ఆయన పై వివిధ పార్టీల నుంచి అనేకమంది సంఘీభావం ప్రకటించారు.మరెంతో మంది వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టి పోస్తూ విమర్శలు చేశారు.

  చివరకు నందమూరి కుటుంబం మొత్తం ఏకమై బాబుకు సంఘీభావం తెలిపాయి.ఇదిలా ఉంటే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం ఈ విషయంలో స్పందించారు.

  బాబుకు తగిన శాస్తి జరిగిందని బాబు పతనాన్ని తాను మరింతగా కోరుకుంటున్నాను అంటూ భారీ బహిరంగ లేఖ రాయడంతో పాటు, అందు లో ఎన్నో సంచలన విమర్శలు చేశారు.

    కాపు ఉద్యమం జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం తన కుటుంబం పట్ల అనుచితంగా వ్యవహరించిందని,  ఇప్పుడు దానికి తగిన శాస్తి జరుగుతోంది అంటూ ఘాటుగా నే ముద్రగడ విమర్శించారు.

అయితే ముద్రగడ కు టిడిపి నుంచి గట్టి కౌంటర్ ఇచ్చే నాయకులే కరువయ్యారు.

కేవలం మాజీ హోం మంత్రి చినరాజప్ప స్పందించారు తప్ప , టిడిపి లోని కీలకమైన నాయకులుగా చలామణి అవుతున్న నాయకులు ఎవరు దీనిపై స్పందించలేదు.

ముఖ్యంగా టిడిపిలో ఉన్న కాపు సామాజిక వర్గం కీలక నాయకుడు వంగవీటి రాధా సైతం ముద్రగడ విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు.

ఏ విషయం పైన అయిన ఘాటుగా స్పందించరు.  విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సైలెంట్ గా ఉన్నారు.

  జ్యోతుల నెహ్రూ , గంటా శ్రీనివాసరావు , నారాయణ ఇలా చెప్పుకుంటూ వెళితే టిడిపి లోని చాలామంది కాపు సామాజిక వర్గం నాయకులే ఈ విషయంలో మౌనంగా ఉండడం టిడిపి అభిమానులు ఎవరికి మింగుడు పడడం లేదు.

    """/"/  టీడీపీ కాపు నేతల సైలెన్స్ పై చంద్రబాబుకు సైతం నివేదిక వెళ్లిందని, ముద్రగడ పై తాము విమర్శలు చేస్తే తమ తమ నియోజకవర్గంలోని తమ కాపు సామాజిక వర్గం లోనే తమ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని, అలాగే కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ కు జరిగిన అవమానంపై మళ్లీ చర్చ మొదలవుతుందనే ఉద్దేశం తో ఎవరికి వారు తమకు ఎందుకు లే అని సైలెంట్ గా ఉండిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

   .

సౌత్ ఆఫ్రికన్ బిర్యానీ ఇండియన్ బిర్యానీ కంటే రుచిగా ఉంటుందా..?