ఏపీలో నేటి నుంచి టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు

ఏపీలో టీడీపీ - జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.భవిష్యత్ కు గ్యారెంటీతో పాటు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

అదేవిధంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలే ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి.ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో పాటు రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా ఈ సమన్వయ సమావేశాల్లో పాల్గొని కీలక అంశాలపై చర్చిస్తారు.

ఈ క్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం, భీమిలి, గాజువాక, విశాఖ ఉత్తరం తరువాత విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.

అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: దేవుడా.. పాము పకోడీ, మోమోలంట..