TDP Jana Sena : టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు..!!
TeluguStop.com
ఏపీలో టీడీపీ - జనసేన( TDP , Janasena ) సీట్ల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది.
బీజేపీ( BJP)తో పొత్తు అంశంపై క్లారిటీ లేకపోవడంతో సీట్ల సర్దుబాటు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని టీడీపీ - జనసేన వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.
"""/" /
ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో చర్చించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం.
అయితే బీజేపీ హైకమాండ్ నుంచి పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పిలుపు రాలేదు.
ఈ క్రమంలో ఇంకా ఆలస్యం జరిగితే నష్టం జరిగే ప్రమాదం ఉందని రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయని తెలుస్తోంది.
బీజేపీ విషయంలో క్లారిటీ రాకుంటే తమ వరకు చేసుకున్న సీట్ల సర్దుబాట్లను ప్రకటించాలని టీడీపీ - జనసేన యోచనలో ఉన్నట్లు సమాచారం.
అమెరికాలో జాగ్రత్త .. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా ఔట్